మంజుల ఒక భారతీయ సినీ నటీమణి. ఈమె భర్త ప్రముఖ నటుడు విజయ కుమార్. చిలకపచ్చ చీరకట్టి చేమంతి పూలుపెట్టి సోకుచేసుకొచ్చానురో.. ఓరయ్యో చుక్కలాంటి చిన్నదాన్నిరో (మా ఇద్దరి కథ), మన్నించుమా ప్రియా, మన్నించుమా.. మరుమల్లె నల్లగా వుంటే (నాపేరే భగవాన్), మనసెందుకో.. మనసెందుకో.. ఓ మోసగాడా (మనుషులు చేసిన దొంగలు), పడకు పడకు.. వెంట పడకు (మంచి మనుషులు), నేనీదరిని.. నువ్వాదరిని.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (బంగారుబొమ్మలు), నినే్నపెళ్లాడుతా.. రాముడు భీముడు (మనుషులంతా ఒక్కటే) ఈ పాటలన్నీ గుర్తుచేసుకుంటే తప్పక గుర్తొచ్చే ఓ వెండితెర మెరుపు తీగ మంజుల. తెలుగులో మంజుల ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమె పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా 'మాయదారి మల్లిగాడు'. హీరోయిన్గా ఆమెకు అది తెలుగులో తొలి సినిమా. ఈ చిత్రంతోనే ఆమె గ్లామర్ హీరోయిన్గా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు మంజుల. ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. అందమైన చిరునవ్వు, చిలిపితనం, సొగసైన నటన, ముద్దులొలికే మాటలతో తెలుగునాట తనదైన స్థానం సంపాదిచుకున్నారు. 1953, సెప్టెంబరు 9న మంజుల జన్మించారు. చెన్నయ్‌లోనే పుట్టి పెరిగిన మంజుల తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 100కిపైగా చిత్రాల్లో నటించారు. మంజుల మరియు ఘట్టమనేని కృష్ణ చ జోడీ తెలుగులో విజయవంతమైన జంటగా పేరొందినది. 1965లో 'శాంతి నిలయం' చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరపై ఆరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన కాదల్ మన్నన్ జెమినీ గణేశన్ చిన్నప్పటి పాత్రలో నటించి, తొలి చూపులో అంద ర్నీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఎంజీఆర్ నటించిన 'రిక్షాకారన్'తో హీరోయిన్గా పరిచయమయ్యారు.
మంజుల నటించిన మొదటి చిత్రం ఏది?
Ground Truth Answers: శాంతి నిలయంశాంతి నిలయం
Prediction: